ఖాజీపేట: కాజీపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్కు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హన్మకొండ జిల్లా కాజీపేటలో రూ.10 కోట్ల వ్యయంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ పాఠశాలను నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.