వనపర్తి: వనపర్తిలో విద్యుత్ కోతలపై రైతుల నిరసన: రహదారిపై బైఠాయించి ఆందోళన
అప్రకటిత విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని వనపర్తి జిల్లాలో రైతులు నిరసన చేపట్టారు. వనపర్తి-పెబ్బేరు రహదారిపై బైఠాయించి 13 గంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఈ చంద్రశేఖర్ హామీతో ఆందోళన విరమించారు.