రాయచోటి: పట్టుబడిన స్మగ్లర్ గొప్య రహస్యాలు వెల్లడి – అదనపు ఎస్పీ వెంకటాద్రి వివరాలు
అటవీ సంపదను కాపాడడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులవ్వాలని, ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రజలు పోలీసులకు సహకరించాలని జిల్లా అదనపు ఎస్పీ శ్రీ.యం.వెంకటాద్రి అన్నారు. శనివారం రాయచోటి రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.తాజాగా టి.సుండుపల్లి మండలంలోని కావలిపల్లె అటవీ ప్రాంతంలో జరిగిన ప్రత్యేక ఆపరేషన్‌లో రూ.81 లక్షల విలువ గల 26 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ కేసులో తమిళనాడుకు చెందిన అంతర్ రాష్ట్ర స్మగ్లర్ ఆండీ గోవిందన్ అరెస్ట్ అయ్యాడని పేర్కొన్నారు.