వర్ధన్నపేట: వరంగల్: పాఠశాల నియామకాల్లో అక్రమాలు.. ఎంఈఓ ఆఫీస్ ఎదుట బాధితుల ఆందోళన
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల ఎంపికలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బాధితులు ఎంఈఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అనర్హులను ఎంపిక చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.