నందికోట్కూరు: వినయ్ హత్యా స్థలాన్ని పరిశీలించి
అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చెప్పట్టాలనిఆదేశించిన ఎస్పీ సునీల్ షెరాణ్
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో గత నాలుగు రోజుల క్రితం ఆత్మకూరు రహదారిలో షికారి పేట కోర్టు వెనకాల జరిగిన వినయ్ హత్య ఘటనపై ఎస్పీ సీరియస్ గా తీసుకున్నారు.ఘటనా స్థలాన్ని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాణ్ పరిశీలించారు.హత్య కేసు దర్యాప్తు అధికారి పట్టణ సీఐ మురళీధర్ రెడ్డి నుండి హత్యకు సంబంధించి పూర్తి వివరాలు,కేసు దర్యాప్తు పురోగతి గురించి ఎస్పీ ఆరా తీశారు.ఆ ప్రాంత స్థానిక ప్రజలతో మాట్లాడి వారి నుండి వివరాలను ఎస్పీ తెలుసుకున్నారు. కేసును అన్ని కోణాల్లో సమగ్రంగా కొనసాగించాలని అందుబాటులో ఉన్న ఆధారాలను శాస్త్రీయంగా విశ్లేషిస్తూ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు