హుస్నాబాద్: ముదిరాజ్ కుల సంఘం భూమి అక్రమ పట్టాపై ప్రజావాణిలో ఫిర్యాదు
అక్కన్నపేట మండలం గుబ్బడి గ్రామంలో ముదిరాజ్ కుల సంఘం భూమిని మాజీ అధ్యక్షుడు మెడబోయిన రాజయ్య అక్రమంగా పట్టా చేయించుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హుస్నాబాద్ ఆర్డీవోకు బాధితులు వినతి పత్రం అందజేశారు.