ఇల్లంతకుంట: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా..
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించరాదని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం మద్య్హనం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు అందుబాటులో ఉండాలన్నారు. సిబ్బంది సమయపాలన కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు.