యాదగిరిగుట్ట: ఆదివారం సెలవు దినం కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ
యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం సెలవు దినం కావడంతో భారీగా భక్తుల రద్దీ పెరగడంతో పాటు నిత్య ఖజానాకు ఆదాయం భారీగా సమకూరింది. ఈ మేరకు ఆదివారం రాత్రి ఈవో వెంకటరావు వివరాలను వెల్లడించారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.1,46,300, విఐపి దర్శనాల ద్వారా రూ. 5, 25000, బ్రేక్ దర్శనాల ద్వారా రూ. 3,59,400, ప్రసాద విక్రయాల ద్వారా రూ.11,15,020, వ్రతాల ద్వారా రూ. 1,42,000, కార్ పార్కింగ్ ద్వారా రూ.4,02,000 తదితర విభాగాల నుండి మొత్తం కలిపి రూ.31,32,463 ఆదాయం సమకూరినట్లు ఈవో వెంకటరావు పేర్కొన్నారు.