కూసుమంచి: నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఓటరు నమోదు: నవంబర్ 6 చివరి తేదీ
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు నమోదు ప్రక్రియ మొదలైంది. 2023 నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు నిండిన వారు నవంబర్ 6లోగా వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. నవంబర్ 25న ముసాయిదా, డిసెంబర్ 30న తుది జాబితా విడుదలవుతుంది.