గుంతకల్లు: నంద్యాల జిల్లా ప్యాపిలి శివారులో కుక్కను తప్పించబోయి అదుపు తప్పిన కారు, నలుగురికి గాయాలు, గుత్తి ఆసుపత్రికి తరలింపు
నంద్యాల జిల్లా ప్యాపిలి శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై కుక్కను తప్పించబోయి కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు పట్టణానికి చెందిన రాముడు, కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి నగరానికి చెందిన దేవానంద్, గోపాల్ లు కారు మాట్లాడుకుని నంద్యాల జిల్లా నందవరం చౌడమ్మ ఆలయంలో జరిగే బంధువుల జాతరకు వెళ్లారు. తిరిగి వస్తుండగా మంగళవారం కారు అదుపు తప్పి స్థంభాన్ని ఢీ కొంది.