నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, చేజర్ల మండలం, మాముడూరుకు చెందిన దళితులు తమకు కేటాయించిన స్మశాన వాటిక అన్యాక్రాంతం కాకుండా భూ రికార్డులలో నమోదు చేయాలని చేజర్ల తాహశీల్దార్ కార్యాలయం ఎదుట బీఎస్పీ నేత టి. కృష్ణ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన నాలుగు ఎకరాల స్మశాన వాటికను కొందరు ఆక్రమించుకున్నారని ఆందోళన చేపట్టారు. స్మశాన భూమిని ప్రభుత్వ రికార్డులలో చేర్చాలని కోరారు.