హనుమకొండ: హన్మకొండ పద్మాక్షి ఆలయంలో ఘనంగా మహాలక్ష్మీ హోమం
హన్మకొండ పద్మాక్షి ఆలయంలో శ్రావణమాసోత్సవాల్లో భాగంగా మహాలక్ష్మీ హోమం నిర్వహించారు. 1008 తామర పుష్పాలతో సహస్ర కమలార్చన చేపట్టినట్లు ఆలయ పూజారులు తెలిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.