నారాయణ్‌ఖేడ్: లోధా సామాజిక వర్గంపై తెలంగాణ బీసీ కమిషన్ క్షేత్రస్థాయి విచారణ
నారాయణఖేడ్ పరిధిలోని సిర్గాపూర్ మండలంలో లోధా సామాజిక వర్గ జీవన పరిస్థితులపై బీసీ కమిషన్ విచారణ చేపట్టింది. కడప్పల్, నిజాంపేట్ గ్రామాల్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న కమిషన్ సభ్యులు, ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదించనున్నారు. పిల్లల విద్యపై దృష్టి పెట్టాలని సబ్ కలెక్టర్ సూచించారు.