సూళ్లూరులో వైఎస్ఆర్సిపి కోటి సంతకాల సేకరణ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం తెచ్చిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఆదివారం మొదలుపెట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఆరోగ్యశ్రీని అమలు చేసిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డిది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లూరు అనిల్ రెడ్డి, కృపాకర్ రెడ్డి, స్వామి రెడ