హుజూరాబాద్: కరీంనగర్లో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు
కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం జిల్లా స్థాయి క్రీడలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖాధికారి వై. తిరుపతి రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.