వరంగల్: మురుగు కాలువల సమస్యపై ప్రశ్నించిన స్థానికులపై మున్సిపల్ జవాన్ ఆగ్రహం
వరంగల్ 40వ డివిజన్ ఉరుసు గాంధీనగర్లో మురుగు కాలువలు శుభ్రం చేయాలని కోరిన స్థానికులపై మున్సిపల్ జవాన్ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి ఫిర్యాదు చేసుకుంటారో చేసుకోండి అంటూ ఆయన అక్కడి నుండి వెళ్లిపోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.