బాపట్ల: అద్దంకి మండలం కలవకూరులో మహిళపై దాడి: ఇటుకరాయితో దాడి చేసిన దుండగులు
బాపట్ల జిల్లా అద్దంకి మండలం కలవకూరులో చావల శివ లీల అనే మహిళపై కొందరు వ్యక్తులు ఇటుకరాయితో దాడి చేశారు. గాయపడిన ఆమెను చికిత్స కోసం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.