కుప్పం: రామకుప్పంలో రెండు స్కూల్ బస్సులు ఢీ - విద్యార్థులకు స్వల్ప గాయాలు
రామకుప్పంలోని ఉప్పు వాళ్ల ఇళ్ల వద్ద రెండు స్కూల్ బస్సులు ఢీకొన్నాయి. ముద్దనపల్లి నుంచి వస్తున్న బస్సును మరో బస్సు ఢీకొనడంతో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి బస్సు డ్రైవర్ మద్యం సేవించడమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు విచారణ చేపడుతున్నారు.