కనిగిరి: సింగిల్ యూత్ ప్లాస్టిక్ ను నిషేధించి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి: కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్
కనిగిరి: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను ప్రతి ఒక్కరు నిషేధించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్ సెంటర్లో గురువారం స్థానిక ప్రజలకు మున్సిపల్ చైర్మన్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించి, గుడ్డతో, పేపర్తో తయారుచేసిన సంచులను వినియోగించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.