పెనుగొండ: కొండంపల్లిలో 2వ రోజు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల శ్రమదానం
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం కొండంపల్లిలో పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-1, వాలంటీర్లు రెండో రోజు బుధవారం మధ్యాహ్నం స్పెషల్ క్యాంపు నిర్వహించారు. కొండంపల్లిలోని ఎంపీపీ స్కూల్ దగ్గర నుంచి మెయిన్ రోడ్డు బస్టాప్ దగ్గర వరకు రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను, కంపచెట్లను విద్యార్థులు తొలగించారు. ప్లాస్టిక్ నివారణ గురించి, తడి, పొడిచెత్త గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.