నందికోట్కూరు: నెహ్రు నగర్ లో తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం మత్స్యశాఖ అధికారి భరత్ లాల్
నంద్యాల జిల్లా నందికొట్కూరు ఆత్మకూరు నియోజకవర్గం లోని 12 మండలాల మత్స్యశాఖ బాధ్యత లు ఒక్క అధికారే నిర్వహిస్తున్నారని మత్స్యశాఖ అధికారి భరత్ లాల్ తెలిపారు, లైసెన్స్ రెన్యువల్స్, పెన్షన్ దరఖాస్తుల సీజన్ కావడంతో పని భారం పెరిగిందన్నారు, నెహ్రు నగర్ లో తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తమని, కార్యాలయంలో ఎలాంటి అక్రమ వస్తువులకు పాల్పడడం లేదని ఆయన స్పష్టం చేశారు, తన పేరు చెప్పి వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు