అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ మావల కేజీబీవీలో న్యాయ విజ్ఞాన సదస్సు: బాలల హక్కులపై అవగాహన
బాలల దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్‌లోని మావల కేజీబీవీలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. బాలల హక్కులు, చట్టాలు, మరియు పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సమస్యలు ఎదురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు సూచనలు చేశారు.