ఆళ్లగడ్డ: సౌత్ జోన్ మహిళా క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఆళ్లగడ్డ యువతి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన సాయి నిఖితా రెడ్డి సౌత్ జోన్ మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు అలాగే జట్టుకు వైస్ కెప్టెన్ గా నియమించారు ఉస్మానియా యూనివర్సిటీ మహిళా క్రికెట్ జట్టుకు నిఖితా రెడ్డి వరుసగా మూడోసారి ఎంపిక కావడం విశేషం గతంలో కర్నూలు జిల్లా సీనియర్ మహిళా జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించారు ఈ సందర్భంగా ఆళ్లగడ్డ అకాడమీ నిర్వాహకులు కోచ్ సుబ్బరాయుడు ఆళ్లగడ్డ పట్టణమని పలువురు ప్రముఖులు కూడా నిఖితా రెడ్డికి అభినందనలు తెలిపారు