బనగానపల్లె: చేనేతలకు కూటమి ప్రభుత్వం అండ: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
వెనుకబడిన చేనేత వర్గాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. బనగానపల్లె పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో మండలంలోని పలుకూరు గ్రామానికి చెందిన చేనేత కార్మికులు మంత్రిని కలిశారు. ప్రభుత్వం నేతన్న సేవ కింద రూ.25వేలు అందించడంపై కృతజ్ఞతలు తెలిపారు. బీసీకి సన్మానం చేశారు