మాక్లూర్: నిజామాబాద్ ఖిల్లా రఘునాథ ఆలయంలో అగ్నిప్రమాదం
నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రఘునాథ ఆలయంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆలయ గదిలో మంటలు చెలరేగగా, ఫైర్ సిబ్బంది మరియు పోలీసులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు మరియు నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.