నందికోట్కూరు: ముంపు నిర్వాసితుల అర్థనగ్న ప్రదర్శనప్రదర్శనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి
శ్రీశైలం నీటి మంపు నిర్వాసితుల నిరుద్యోగులకు 98 జీవో ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ నిర్వాసితులు అర్థ నగ్న ప్రదర్శన చేశారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో గత 170 రోజులుగా నిర్వాసితులు నిరాహార దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం నిర్వాసితులతో కలిసి నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి మద్దతు తెలుపుతూ అర్థనగ్న ప్రదర్శన శిబిరం నుండి పటేల్ సెంటర్ వరకు నిర్వహించారు.పొట్టి శ్రీరాములు,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,పటేల్ విగ్రహాలకు పూలమాలలు వేశారు.ఈ సందర్భంగా లబ్బి వెంకటస్వామి మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్ట్ కోసం త్యాగం చేసిన త్యాగధనులకు గురించి నేటి పాలకులు పట్ట