భీమిలి: నాగుల చవితి వేడుకలకు వెళ్తూ ప్రమాదం: స్కూటీ డివైడర్ను ఢీకొట్టి యువతి మృతి
నాగుల చవితి సందర్భంగా సొంతూరు వెళ్తుండగా మధురవాడ లా-కాలేజ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పీఎం పాలెంకు చెందిన అమృత వర్షిని (21) మృతి చెందింది. స్కూటీ డివైడర్ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సోదరి ఆదిత్య హర్షిని స్వల్ప గాయాలతో బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేశారు.