కూసుమంచి: వరంగల్-నల్గొండ-ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిరుద్యోగ నాయకుడు అశోక్ పోటీ
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు నిరుద్యోగ పోరాట నాయకుడు అశోక్ ప్రకటించారు. ప్రధాన పార్టీలు బీసీలకు టికెట్లు ఇవ్వకుండా రెడ్లకు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. నిరుద్యోగుల కోసం తాను చేసిన పోరాటాలను దృష్టిలో ఉంచుకుని పట్టభద్రులు మద్దతు తెలపాలని ఆయన కోరారు.