నందికోట్కూరు: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రమాదం
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద గురువారం ప్రమాదం చోటుచేసుకుంది, శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పూర్తిస్థాయిలో ప్రవహిస్తున్న తరుణంలో అధికారులు హెడ్ రెగ్యులేటర్ గేట్లను పైకి ఎత్తుతుండగా 9వ నెంబర్ గేట్ ఐరన్ రోప్ ఒక్కసారిగా తెగిపోయింది, దీంతో భారీ బరువు గల ఐరన్ గేటు అదుపు తప్పి నీటిలో పడి అలాగే నిలిచిపోయింది ప్రమాదం జరిగిన సమయంలో 8000 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది, ఇరిగేషన్ అధికారులు పోతిరెడ్డిపాడు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు