అదిలాబాద్ అర్బన్: ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు: అధికారులకు కీలక ఆదేశాలు
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఇచ్చోడ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల వేగవంతమైన దర్యాప్తు, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు బాధితులకు సత్వర న్యాయం అందించేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రిత్విక్ సాయి కొట్టేతో పాటు స్థానిక పోలీస్ అధికారులు పాల్గొన్నారు.