చేర్యాల: రోడ్ల తవ్వకాలపై సీపీఐ ఆగ్రహం, వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్
చేర్యాల అంగడి బజార్ నుండి పెద్దమ్మ గడ్డ వరకు పైపులైన్ల పేరుతో అక్రమంగా రోడ్లు తవ్వారని సీపీఐ నేతలు మండిపడ్డారు. రోడ్డు ధ్వంసం కావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ డిమాండ్ చేశారు.