నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఆత్మకూరులో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ వద్ద ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు గురైంది. విద్యుత్ సరఫరా ఆగిపోండంతో వెంటనే సిబ్బంది స్పందించారు. జోరువానలో సైతం మరమ్మతులు చేపట్టి సరఫరాను పునరుద్ధరించారు. దీంతో స్థానిక ప్రజలు విద్యుత్ శాఖ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.