శ్రీశైలం: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న చక్కెర ధర. ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరుకున్న చక్కేర దరలు
చక్కెర ధరలు ఆకాశానంటుతున్నాయి. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న చక్కెర ధరలు ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి.కేవలం 15 రోజుల వ్యవధిలోనే కిలో చక్కెర ధర ఏకంగా 30 రూపాయలు పెరిగింది. 15 రోజుల క్రితం కిలో చక్కెర 40 రూపాయలు ఉండగా, ప్రస్తుతం మార్కెట్లో కిలో చక్కెర 70 రూపాయలకు విక్రయిస్తున్నారు.చక్కెర ధరలు ఒక్కసారిగా భారీగా పెరగడంతో సామాన్య వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. చెరుకు పంట సాగు తగ్గిపోవడం, దాని ప్రభావంతో చక్కెర ఉత్పత్తి తగ్గడం వల్లే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారస్తులు చెబుతున్నారు.చక్కెర ధరలతో పాటు బెల్లం ధరలు కూడా ఆకాశాన్ని తాకాయి.