చిన్నబాబయ్యపల్లిలో కేబుల్ వైర్ చోరీ
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం చిన్నబాబయ్య పల్లిలో గ్రామ పంచాయతీ తాగునీటి బోరు మోటార్ల విద్యుత్ కేబుల్ వైరును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని గ్రామస్థులు తెలిపారు. సోమవారం మోటారు ఆన్ కాకపోవడంతో వైరు చోరికి గురైనట్లు గుర్తించారు. 25 మీటర్ల కేబుల్ వైరు విలువ రూ.5 వేలకు పైగా ఉంటుందన్నారు. కేబుల్ వైర్లు దొంగలిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని, చర్యలు చేపట్టాలని కోరుతున్నారు