మోత్కూర్: సన్న రకం ధాన్యానికి క్వింటాకు 5000 మద్దతు ధర కల్పించాలి: పోచం సోమయ్య
రైతులు పండించిన సన్న రకం ధాన్యానికి క్వింటాకు 5000 రూపాయల ధర కల్పించాలని ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు పోచం సోమయ్య ప్రభుత్వాన్ని కోరారు. వ్యాపారులు బియ్యాన్ని అధిక ధరలకు అమ్ముతున్నా, రైతుల దగ్గర మాత్రం తక్కువకు కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.