మామిడికుదురు: మామిడికుదురు - అప్పనపల్లి మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
పాసర్లపూడి ఏటిగట్టు వంతెన అప్రోచ్ పనుల కారణంగా మామిడికుదురు - అప్పనపల్లి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలను కొర్లగుంట మీదుగా మళ్లించడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.