కుప్పం: ఐరాల నూతన జడ్పీటీసీ మహేష్ స్వేరోకు ఘన సత్కారం
ఐరాల నూతన జడ్పీటీసీ ఎం. మహేష్ స్వేరోను రామకుప్పం మండల కేంద్రంలో టీడీపీ నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.