కరీంనగర్: శాతవాహన వర్సిటీలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.. నశా ముక్తి భారత్ ప్రతిజ్ఞ
శాతవాహన విశ్వవిద్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు మాదకద్రవ్యాల రహిత భారత్ (నశా ముక్తి భారత్) కోసం సామూహిక ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, న్యాయశాస్త్ర విద్యార్థులు పాల్గొన్నారు.