సిద్దిపేట అర్బన్: సిద్దిపేటలో మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యేక డ్రైవింగ్ శిక్షణ: ప్రాజెక్ట్ సిద్ధి ప్రారంభం
సిద్దిపేటలో 'ప్రాజెక్ట్ సిద్ధి' కార్యక్రమం ద్వారా 14 మంది మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యేక డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నారు. పోలీస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వింగ్లో మహిళల భాగస్వామ్యాన్ని, వాహన నిర్వహణ నైపుణ్యాలను పెంచేందుకు సీపీ రష్మి పెరుమాళ్ ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.