రాజమండ్రి సిటీ: రాజమండ్రి మేయర్ సీటు మాదిగలకు కేటాయించాలి: ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు డిమాండ్
రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సీటును మాదిగలకు కేటాయించాలని మహాజన సభ సోషలిస్టు పార్టీ నేత ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు డిమాండ్ చేశారు. 80 ఏళ్లుగా మాదిగలకు రాజకీయ అన్యాయం జరుగుతుందని, కూటమి ప్రభుత్వం ఈసారి అవకాశం కల్పించాలని ఆయన కోరారు.