గిద్దలూరు: రాచర్ల మండలం జెపి చెరువు ఆలయాన్ని సందర్శించి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
రాచర్ల మండలం జేపీచెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో కలిసి మంగళవారం ఎస్పీ దర్శించుకున్నారు. ముందుగా ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలలో పాల్గొని అనంతరం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించామని ఎస్పీ తెలిపారు.