వనపర్తి: వనపర్తిలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి నివాళులు
వనపర్తి కలెక్టరేట్లో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం జరిగింది. అదనపు కలెక్టర్లు ఖిమ్యా నాయక్, వినోద్ కుమార్ పాల్గొని ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఐలమ్మ పోరాట పటిమను, ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.