కాకినాడ సిటీ: కాకినాడలో నెహ్రూ పాత విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలి: సామాజిక వేత్త రమణరాజు
కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ లో 1964 నాటి నెహ్రూ బస్ట్ సైజు విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలని సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు. 2026-31 కొత్త కౌన్సిల్ తొలి సమావేశం ఎజెండాలో దీనిని చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు.