నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, మర్రిపాడు మండలంలో పెను ప్రమాదం తప్పింది..మర్రిపాడు మండలం, నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై కండ్రిక- నందవరం మార్గమధ్యలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న బొగ్గు లారీని అదే మార్గంలో వెనుకనుండి వస్తున్న ఇసుక లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇసుక లారీ ముందు భాగం నుజ్జు నుజ్జు అవ్వగా అదృష్టవశత్తు డ్రైవర్ ప్రమాదం నుండి బయటపడ్డాడు ప్రమాద తీవ్రత భయంకరంగా ఉన్న ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు