గద్వాల్: జూరాల ప్రాజెక్టు నుంచి 29 గేట్లు ఎత్తి నీటినీ విడుదల చేసిన ప్రాజెక్టు అధికారులు
నెలరోజులు గడిచిపోయినా కృష్ణా నదిలో వరద ప్రభావం మాత్రం తగ్గడమే లేదు. ఎగువన కురుస్తున్న వర్షాలకు గద్వాల జిల్లాలో జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. శుక్రవారం సాయంత్రం జూరాల ప్రాజెక్టు 29 గేట్లను ఎత్తి సుమారు లక్షల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణమ్మ దిగువన ఉన్న నాగార్జున సాగర్కు ఉరకలేస్తోంది. నది తీర ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.