వికారాబాద్: అనంతగిరిలో వైభవంగా కార్తీక జాతర: పోటెత్తిన భక్తజనం
వికారాబాద్ జిల్లా అనంతగిరిలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించగా, రథోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీగా తరలివచ్చిన భక్తుల కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.