సంగెం: రెవెన్యూ అధికారిగా నమ్మించి లక్ష రూపాయల మోసం: కేసు నమోదు
వరంగల్ జిల్లాలో ఆర్డీవో కార్యాలయ ఉద్యోగినని నమ్మించి, భూమి రిజిస్ట్రేషన్ పేరుతో మహిళ వద్ద లక్ష రూపాయలు వసూలు చేసిన జక్కి సందీప్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.