జగ్గంపేట: గోకవరం మండలం బాబాజీపేటలో వివాహితపై అత్యాచారం, నిందితుడి కోసం పోలీసుల గాలింపు
జగ్గంపేట నియోజకవర్గం బాబాజీపేటలో మేకలు మేపుకునే వివాహితపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. పుష్కర కాలువ గట్టు వద్ద ఈ ఘటన జరగగా, బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని అడిషనల్ ఎస్పీ దేవరాజ్ పాటిల్ పరిశీలించగా, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.