పరకాల: పరకాలలో కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ నిరసన: అధికారులకు వినతిపత్రం
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ హన్మకొండ జిల్లా పరకాలలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలకు వినతిపత్రం అందజేశారు.