గుంతకల్లు: గుత్తి మండలం తొండపాడులో గ్యాస్ సిలిండర్ తీసుకుని రాలేదని మహిళ ఆత్మహత్యాయత్నం, గుత్తి ఆసుపత్రికి తరలింపు
అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో ఆదివారం ఇంటికి గ్యాస్ సిలిండర్ తీసుకురాలేదని భర్తతో గొడవ పడి మహాలక్ష్మి అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. తొండపాడు గ్రామానికి చెందిన మహాలక్ష్మి అనే మహిళ గత మూడు నెలలుగా సిలిండర్ తీసుకుని రావాలని భర్త హరికృష్ణను కోరుతుండేది. భర్త తన వద్ద డబ్బులు లేవని సిలిండర్ తీసుకుని రాలేదు. డబ్బులున్నాయి సిలిండర్ తీసుకుని రావాలని భార్య కోరడంతో గత మూడు రోజులుగా భర్త హరికృష్ణ సిలిండర్ కోసం గుత్తి పట్టణానికి వస్తున్నాడు. అయితే సిలిండర్లు దొరకడం లేదు.